మరికాసేపట్లో బీహార్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ముందుగా ఆయన గాల్వాన్ ఘర్షణలో అమరులైన ఐదుగురు జవాన్ల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.అదేవిధంగా సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో బీహార్ కార్మికులు చనిపోయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో చనిపోయిన 12 మంది కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెక్కులను అందించనున్నారు.అనంతరం బీహార్ సీఎం నితీష్ కుమార్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొంటారు.ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు.