బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరికి పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది.ఛత్తీస్‌గఢ్ బాధ్యతల నుంచి ఆమెను పూర్తిగా తప్పించారు.ఇప్పటికే ఒడిశా పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ బాధ్యతల్లో కోతలు విధించిన విషయం తెలిసిందే.2020 నవంబర్ నుంచి ఆమె ఛత్తీస్‌గఢ్, ఒడిశా బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్‌లుగా ఉన్నారు.
పురంధేశ్వరి స్థానంలో రాజస్థాన్‌కు చెందిన కీలక నేత ఓం మాథుర్‌ను ఛత్తీస్ గఢ్ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్‌గా నియమిస్తూ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది.పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఇంఛార్జ్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.







