తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి సారించింది.119 నియోజకవర్గాల్లో బూత్ కమిటీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ సమావేశాల్లో జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, బండి సంజయ్, కిషన్ రెడ్డిలు పాల్గొననున్నారు.బీఆర్ఎస్ తో ఒప్పందం కోసమే దిగ్విజయ్ తెలంగాణకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత ఇరుక్కుందని ప్రభాకర్ అన్నారు.నిన్న పంజాబ్ సీఎంతో కేసీఆర్ లిక్కర్ స్కాం కేసుపై చర్చించారని ఆరోపించారు.తెలంగాణకు ఏం చేయని కేసీఆర్ దేశానికి ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు.







