నాగర్ కర్నూలు జిల్లాలో( Nagarkurnool ) బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అన్ని లోక్ సభ స్థానాల్లో కమలం వికసించాలన్నారు.
రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని పేర్కొన్నారు.కాంగ్రెస్ హయాంలో ఏనాడూ పేదల బతుకులు బాగుపడలేదని ఆరోపించారు.
అయితే బీజేపీ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని చెప్పారు.

ఈ క్రమంలోనే కేంద్రంలో మరోసారి బీజేపీ( BJP ) సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఇవాళ ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుందన్న మోదీ ఎన్నికల తేదీ కంటే ముందే ప్రజలు ఫలితాలను నిర్ణయించారని తెలిపారు.ఈ నేపథ్యంలో ఎన్డీయే 400 సీట్లు గెలుచుకుంటుందన్న మోదీ తెలంగాణలోనూ అదే గాలి వీస్తోందని వెల్లడించారు.







