జగన్‌కు బీజేపీ షాక్.. కౌంటర్ పడుతోంది‌గా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కారు ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా అప్పులు తీసుకున్నారని, అమలు సాధ్యం కాని హామీలు ఇస్తున్నదని ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ సోము వీర్రాజు నేతృత్వంలోనే నేతల బృందం కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసేంది.ఈ క్రమంలోనే ఏపీ సర్కారుకు కౌంటర్ పడబోతున్నదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

 Bjp Shock To Jagan As If The Counter Is Falling, Bjp, Jagan, Ap Bjp Leaders, Com-TeluguStop.com

జగన్ సర్కారుపైన బీజేపీ కౌంటర్ ప్రారంభించబోతున్నదని తాజా పరిణామాలను బట్టి అంచనా వేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.

నిబంధనలను అస్సలు పట్టించుకోకుండా జగన్ సర్కారు దాదాపు రూ.21,500 కోట్ల రుణం తీసుకుంటోందని, ఈ విషయమై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరించారు.

ఏపీలో వేతనాలు, పింఛన్లు సమయానికి అందడం లేదని తెలిపారు.పబ్లిక్ సెక్టార్ బ్యాక్స్ కన్సార్షియం నుంచి ప్రభుత్వ గ్యారెంటీతో ఏపీ స్టేట్‌ డెవలవ్‌మెంట్‌ కార్ఫొరేషన్‌కు రూ.13,500 కోట్ల రుణం ఇప్పిస్తోందని, ఇందుకోసం గతేడాది నవంబరు 5న ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల మధ్య అకౌంట్ ఓపెన్ చేశారని చెప్పారు.వివిధ బ్యాంకుల నుంచి అదనంగా కోట్ల రూపాయల రుణం తీసుకుంటున్నట్లు తమకు తెలిసిందని వివరించారు.

Telugu Ap Bjp, Apcm, Ap, Jagan, Somu Veerraju-Telugu Political News

ఈ క్రమంలోనే లిక్కర్ ఇన్‌కమ్‌ను పూచీకత్తుగా పెట్టారని వివరించారు.సీఎం జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు.ఈ విషయాలన్నిటితో పాటు ఇళ్ల వ్యవహారంపైన ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు.అన్ని విషయాలపైన పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కేంద్రమంత్రిని కోరారు.మొత్తానికి కేంద్రం సహకారంతో ఏపీ బీజేపీ నేతలు జగన్ సర్కారుపై పోరుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో బీజేపీ ఎదుగదల కోసం ఏపీ బీజేపీ నాయకత్వం డిఫరెంట్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube