కెసీఆర్ రాజ్యాంగ మార్పు వ్యాఖ్యలపై తగ్గేదేలే అంటున్న బీజేపీ

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తాజాగా కేంద్ర బడ్జెట్ పై నిర్వహించిన విలేఖరుల సమావేశంలో రాజ్యాంగాన్ని మార్చాలన్న వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే.అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడటం, మౌన దీక్ష చేపట్టడం మనకు తెలిసిందే.

 Bjp Says Kcr Is Declining On Comments On Constitutional Chang Telangana Politics-TeluguStop.com

అయితే మిగతా కాంగ్రెస్ లాంటి పార్టీలు ఆ వ్యాఖ్యలపై కామెంట్స్ చేయకున్నా బీజేపీ మాత్రం ఇంకా వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తూనే ఉన్న పరిస్థితి ఉంది.ఎందుకంటే బీజేపీ పార్టీ కెసీఆర్ ప్రెస్ మీట్ తో ఒక్కసారిగా ప్రజల్లో పలుచనయిన విషయం తెలిసిందే.

అయితే బీజేపీ పార్టీ మాత్రం ఈ విషయంపై తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది.

తాజాగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ నీకు తగ్గట్టు రాజ్యాంగం రాస్తామని రాజ్యాంగాన్ని మార్చాలన్న కెసీఆర్ వ్యాఖ్యల పట్ల దళితులు పెద్ద ఎత్తున ఆగ్రహంగా ఉన్నారని త్వరలోనే కెసీఆర్ కు ప్రజలు బుద్ది చెబుతారని బండి సంజయ్ అన్నారు.యితే బీజేపీ ఈ అంశాన్ని ఇంకా చల్లారనీయకుండా  ఇక టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగే విధంగా పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.

అయితే ఇంకా ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ఎలా అనే దానిపై బీజేపీలో చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది.

ఈ తరుణంలో చాలా వరకు కెసీఆర్ చర్చను పక్కదోవ పట్టించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొడుతున్నారని సచివాలయం నిర్మాణం మీద ఉన్న ధ్యాస అంబేద్కర్ విగ్రహం నిర్మాణం మీద లేదని బండి సంజయ్ పత్రికా ముఖంగా మండిపడ్డారు.ఏది ఏమైనా బీజేపీ మాత్రం టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలలోకి వెళ్ళడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది.ఆచరణలో కూడా చూపిస్తోంది.

BJP Says KCR Is Declining On Comments On Constitutional Chang Telangana Politics, Kcr, Bandi Sanjay, Ts Poltics , Bjp Party , Constitutional Chang, Trs Party - Telugu @bjp4telangana, @cm_kcr, @trspartyonline, Bandi Sanjay, Bjp, Telangana, Trs

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube