జగన్ పై ఆశలు ... పవన్ తో పొత్తు ! బీజేపీ వ్యూహం ఇదే ?

ఏపీ విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలు పెద్ద ప్లానే వేసినట్టుగా కనిపిస్తున్నారు.దేశవ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితులు, బీజేపీ పై జనాల్లో పెరుగుతున్న వ్యతిరేకత, ఎన్డీయే లోని మిత్రపక్షాలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళి పోతూ ఉండటం వంటివి కాస్త ఆందోళన కలిగించే అంశాలే .

 Bjp Political Strategies For Jagan And Pawan Kalyan Support Details,  Jagan, Jan-TeluguStop.com

ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులకు వైసిపి ఎంపీలు అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు.ఏపీలో బీజేపీ, వైసీపీ మధ్య విమర్శలు ,ప్రతివిమర్శలు కొనసాగుతున్నా సరే కేంద్రంలో బిజెపికి మాత్రం జగన్ మద్దతు పలుకుతున్నారు.

అలాగే కేంద్ర బీజేపీ పెద్దలు సైతం జగన్ కోరినప్పుడల్లా అపాయింట్మెంట్ ఖరారు చేస్తూ, అండగా నిలబడుతున్నారు.ఇప్పుడే కాదు రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచినా, తప్పకుండా జగన్ అవసరం ఉంటుందనే విషయాన్ని బీజేపీ కేంద్ర పెద్దలు గుర్తించారు .

అందుకే ఈ విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హితబోధ చేసేందుకు బీజేపీ పెద్దలు సిద్ధమవుతున్నారట.చంద్రబాబుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని , గతంలో ఆయన వ్యవహరించిన తీరును పవన్ కు వివరించారట.

టిడిపి, జనసేన బీజేపీలు కలిసి పోటీ చేస్తే ఫలితం ఉంటుందని, ఢిల్లీకి వెళ్లి మరి పవన్ బిజెపి పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేసిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం .ప్రస్తుతానికి రాజకీయంగా ఇబ్బందులు ఎదురైనా.2029 ఎన్నికల నాటికి జనసేన, బిజెపి లు కలిసే ఉంటాయని, అప్పుడు ఈ రెండు పార్టీల బలం పెరుగుతుందని, టిడిపి  అప్పటికి.ఉనికి కోల్పోయే అవకాశం ఉంటుందని బీజేపీ పెద్దలు అంచనాకు వేస్తున్నారట.

ఇదే విషయాన్ని పవన్ కు నచ్చచెప్పేప్రయత్నం చేస్తున్నారట.

Telugu Amith Sha, Ap, Bjpjanasena, Bjp, Central, Jagan, Janasean Bjp, Janasena,

బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ముందుగానే ప్రకటించకపోవడానికి కూడా కారణాలు చెప్పారట.ఏ రాష్ట్రంలోను ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ముందుగా ప్రకటించడం బీజేపీకి ఆనవాయితీ లేదని, అందుకే ఇక్కడ ఆ ప్రకటన చేయలేదని, ఒకవేళ బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామనే విషయాన్ని చెప్పడంతో పాటు , ఈ విషయంపై స్పష్టమైన రూట్ మ్యాప్ జనసేన కు ఇవ్వాలని బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Telugu Amith Sha, Ap, Bjpjanasena, Bjp, Central, Jagan, Janasean Bjp, Janasena,

అంటే ఏపీలో బిజెపి, జనసేన కు వైసిపి ప్రత్యర్థిగా ఉన్నా.కేంద్రంలో మాత్రం వైసీపీ మద్దతు బిజెపి కోరుకుంటున్నట్టు గానే కనిపిస్తోంది.అంతేకాకుండా కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో కొన్ని కీలక పదవులను జనసేనకు ఇస్తామనే ప్రతిపాదనను కూడా చేసి జనసేన తమ చేయి దాటిపోకుండా చూసుకుని ప్రయత్నాల్లో బీజేపీ అగ్ర నాయకులు ఉన్నట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube