చంద్రన్న రాళ్లు : బాబు కొత్త స్కీమ్ పెట్టారట కదా ...?

హెడ్డింగ్ చదివి అసలే ఎన్నికల సీజన్ కదా .! ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త స్కీమ్ ప్రాంభించారా అనే డౌట్ మీకు రావచ్చు.

 Bjp Mp Gvl Narasimharao Commented On Ap Cm Chandrababu Naidu1-TeluguStop.com

కానీ ఈ కొత్త స్కీమ్ ప్రారంభించినట్టు … కనీసం బాబు కే తెలియదు.కానీ బాబు ఆ స్కీమ్ ప్రారంభించినట్టు బీజేపీ ప్రకటించింది.

ఇంతకీ విషయం ఏంటి అంటే… ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రన్న రాళ్లు అనే కొత్త స్కీమ్ స్టార్ట్ చేసినట్టు బీజేపీ ఎమ్.పి జివిఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.కడప స్టీల్ ప్లాంట్ కు చంద్రబాబు శంకుస్థాపన చేయడాన్ని ఆయన విమర్శించారు.శంకుస్థాపన రాళ్లు పాతి రాయలసీమ ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని,ప్రజలు ఇలాంటివాటిని నమ్మబోరని ఆయన అన్నారు.

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబందించి కేంద్రం అడిగిన సమాచారం ఇవ్వకుండా బాబు నాటకాలాడుతున్నరాణి ఆయన అన్నారు.ఫ్యాక్టరీ పెట్టేముందు అసలు స్టీల్ ప్లాంట్ కు పెట్టుబడులు ఎలా సేకరిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.కాగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ఒక ప్రకటన చేస్తూ ఎపి ప్రభుత్వం కేంద్రం అడిగిన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించింది.అయినా ఎపి ప్రజలకు న్యాయం చేయడానికి కేంద్రం సిద్దంగా ఉందని బీజేపీ తెలిపింది.

మౌలిక సదుపాయాలు, ఇనుప ఖనిజ నిక్షేపాల గురించి తాము అడిగిన నివేదిక ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube