నూతనంగా ఏర్పడిన పల్నాడు జిల్లాకు పలు కేంద్ర సంస్థలు తెచ్చేలా కృషి చేస్తానని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం దానిని సద్వినియోగం చేసుకోలేకపోతోందని విమర్శించారు.
పల్నాడు జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కోసం త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నం చేయనున్నట్లు ఎంపీ జీవీఎల్ వెల్లడించారు.







