బిజేపి సభ్యులు అని తెలీగానే పధకాలను కట్ చేస్తున్నారు - జివిఎల్ నరసింహారావు

విశాఖ: రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు కామెంట్స్… బిజేపి సభ్యులు అని తెలీగానే వారికి హక్కుగా లభించే పధకాలను కట్ చేస్తున్నారు.రేషన్ కార్డులపై అనర్హత వేటు వేయడమో, పెన్షన్షన్ తొలగించడమో చేస్తున్నారు.

 Bjp Mp Gvl Narasimha Rao Shocking Comments On Ycp Government Details, Bjp, Mp Gv-TeluguStop.com

పథకాలు తొలగించే క్రమంలో అధికారులు విచక్షణతో మెలిగాలి.పెద్ద సంఖ్యలో ఓటర్లను రద్దు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది…ఆంధ్రేతర ప్రాంతానికి చెందిన ఓటర్లను కావాలని జాబితాలోంచి తొలగించారు.చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు లేఖరాయడం జరిగింది.50 వేలకు తక్కువ కాకుండా ఓట్లు గల్లంతు చేశారు.ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఎలక్షన్ కమిషన్ ను కోరాము.అందుకు చర్యలు మొదలయ్యాయి.ఉద్దేశ పూర్వకంగా చేసినట్లు రుజువైన నేపద్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.లిక్కర్ స్కామ్ పై ఢిల్లో లో డొంక కదిలితే ఆంధ్రా తెలంగాణాల్లో మూలాలు వెలుగు చూస్తున్నాయి.

రెండు రాష్ట్రాల్లో అధికారపార్టీ కి సంబంధాలు వున్నట్లు తెలుస్తోంది.దీనిపై రెండు ప్రభుత్వాలు ఎందుకు స్పందించడంలేదు.

లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో హిందూపూర్ లో 4,200 ఎకరాలు బ్యాంకులకు తనకాపెట్టారు.

ఆ భూములను 500 కోట్లకే ఒక ప్రైవేటు సంస్ధ చేజెక్కించుకుందంటే ఎంత దారుణం.

బెంగుళూరు కు అత్యంత విలువైన భూములను అడ్డగోలుగా కాజేసే చర్యలపై ఏపి ప్రభుత్వం స్పందిచదా.వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ దిక్కు దివానా లేదు.ఎన్.సి.ఎల్.టి తో సంప్రదించి వివారాలు ఆరా తీస్తాను.భూములను ఏ పర్పస్ కోసం ఇచ్చారు…ల్యాండ్ అగ్రిమెంట్ పై జరిగిన అంశాలు తెలపాలి. జగన్ ప్రభుత్వం దీనిపై ఖచ్చితంగా బైటపెట్టాలి.ఓ ఎమ్మెల్యే కొడుకు సదరు సంస్ధలో డైరెక్టర్ గా వున్నారని, వారికి వుండే ఆసక్తి ఏంటో ఏపి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి.లిక్కర్ స్కామ్ లో నిబంధనలు తుంగలోకి తొక్కరాని ఢిలీ చీఫ్ విజిలెన్స్ విభాగం నిర్ధారించింది.

ఢిల్లీ ప్రభుత్వం సమాధానం చెప్పడంలేదు.అమిత్ షా ,జూ ఎన్టీఆర్ భేటీలో రాజకీయప్రస్తావన లేకుండా వుండగలదా.

వారిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయో వారే చెప్పాలి.

ఎమ్మెల్సీ మాధవ్ కామెంట్స్… యువసంఘర్షణ సభ పెద్ద ఎత్తున విజయవంతమైంది.దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించుకోబోతోంది.సెప్టెంబరు25 కల్లా బూత్ స్ధాయిలో కర్యకర్తలను బలోపేతం చేస్తాము.అమిత్ షాను కూడా ఏపికి ఆహ్వానిస్తాము.175 నియోజకవర్గాల్లో విస్తారకులను తీసుకువస్తాము.లేపాక్షి నాలెడ్జ్ హబ్ , వాంపిక్ , వైజాగ్ చెన్నై కారిడార్ లకు ఒక్క ఇంచ్ పని కూడా జరగలేదు.22ఏ విషయంలో జరుగుతోన్న విధానాలపై ప్రజలకు అండగా వుంటాము.

బిజేపి ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు కామెంట్స్… లేపాక్షి నాలెడ్జ్ హబ్ స్ధలాలు దోపిడీ జరుగుతోన్నపుడు గవర్నర్ గారు మేలుకోవాల్సిన అవసరం వుంది.సిబిఐ విచారణ జరిపించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube