బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బీజేపీ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.ఈ క్రమంలో అత్యవసరంగా దీనిపై విచారణ జరపాలని బీజేపీ తరపు న్యాయవాదులు కోర్టును కోరగా.మధ్యాహ్నం 3.45 గంటలకు విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం అంగీకరించింది.అయితే, బండి సంజయ్ కరీంనగర్ లోని తన నివాసంలో దీక్షను విరమించారు.







