తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు ప్రజలు గుర్తొస్తారని విమర్శించారు.
టీఆర్ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.ఉద్యోగాల విషయంలోనూ యువతను మోసం చేశారని మండిపడ్డారు.
అంతేకాకుండా సింగరేణిని నష్టాల వైపు నడిపించి నిధులను దోచుకున్నారని ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టుతో మంచిర్యాల జిల్లాను ముంపు ప్రాంతంగా మార్చారని ఎద్దేవా చేశారు.
లక్షల కోట్లు వెచ్చించి ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదని తెలిపారు.దేశంలో ఎక్కడా అవినీతి జరిగినా దాని మూలాలు తెలంగాణలో దొరుకుతున్నాయని విమర్శలు గుప్పించారు.







