బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెండ్ కు గురయ్యారు.పార్టీ అధిష్టానం రాజాసింగ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
ఈ మేరకు సస్పెన్షన్ వేటు వేసింది.పార్టీ నుండి ఎందుకు బహిష్కరించకూడదో సెప్టెంబర్ 2 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
అంతేకాకుండా బీజేఎల్పీ పోస్ట్ నుంచి కూడా రాజాసింగ్ ను హైకమాండ్ తప్పించింది.సామాజిక మాధ్యమాల్లో రాజాసింగ్ పోస్ట్ చేసిన ఓ వీడియో వివాదాస్పదమై వైరల్ గా మారడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఒక వర్గం ఆందోళనకు దిగడంతో దుమారం చెలరేగింది.







