ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత, తెలంగాణకు మొట్టమొదటిసారిగా వచ్చిన డాక్టర్ లక్ష్మణ్ ను, బిజెపి నాయకులు-కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు .శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీతో బయలుదేరి ఆరాంఘర్ – అత్తాపూర్ – గుడిమల్కాపూర్ – మెహదీపట్నం నుండి నాంపల్లి లోని బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు .
ఈ ర్యాలీ లో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు-కార్యకర్తలు పాల్గొన్నారు .మార్గ మధ్యంలో పలు చోట్లలో లక్ష్మణ్ కు ఘన స్వాగతాలు పలికారు .
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలంగాణ లో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చినందుకు కేంద్ర అగ్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.ఒక సామాన్య కార్యకర్తగా నన్ను ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం నుండి రాజ్యసభకు పంపించడం వెనుకబడిన తరగతులకు చెందిన తనకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
యూపీ లాగ ఇక్కడ డబల్ ఇంజన్ సర్కార్ అధికారం తేవడమే లక్ష్యంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి తెలంగాణాలో అధికారం లోకి వచ్చే విధంగా కృషి చేస్తామని లక్ష్మణ్ అన్నారు .







