మిస్ కర్ణాటక గా నిలిచిన శ్రీనిథి శెట్టి మోడలింగ్ లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది.అనుకోని అవకాశం అన్నట్లుగా ఈ అమ్మడికి కేజీఎఫ్ లో అవకాశం వచ్చింది.
యశ్ కు జోడీగా ప్రశాంత్ నీల్ ఈమెను నటింపజేశాడు.మొదటి పార్ట్ లో శ్రీనిథి శెట్టి యొక్క రోల్ తక్కువే.
అయినా కూడా ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆఫర్లు వస్తాయని అంతా అనుకున్నారు.ఆఫర్లు వచ్చాయో లేదా అసలు ఆఫర్లు రాలేదే తెలియదు కాని కేజీఎఫ్ 1 కి కేజీఎఫ్ 2 కి మద్య ఒక్క సినిమా తో కూడా ఈమె రాలేదు.
కేజీఎఫ్ 2 తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లను దక్కించుకున్న కేజీఎఫ్ 2 లో నటించిన కారణంగా శ్రీనిథి శెట్టికి ఖచ్చితంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు వస్తుందని అంతా భావించారు.
కాని ఇప్పటి వరకు ఆమె తదుపరి సినిమా విషయం లో క్లారిటీ ఇవ్వలేదు.కొన్నాళ్ల క్రితం కమిట్ అయ్యి చేసిన తమిళ మూవీ కోబ్రా తో త్వరలో రాబోతుంది.
ఆ సినిమా కాకుండా మరే సినిమా ను కూడా ప్రస్తుతం ఈ అమ్మడు చేయడం లేదు.అసలు ఈమె ఎందుకు సినిమా లు చేయడం లేదు.
ఎంత చిన్న హీరోయిన్ అయినా ఏదో ఒక ఆఫర్ వస్తూనే ఉంటుంది.ఇంత పెద్ద సక్సెస్ దక్కించుకున్న శ్రీనిధి కి ఆఫర్లు రాకపోవడం విడ్డూరంగా ఉందంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె చేసే ప్రతి సినిమాను కూడా స్టార్ తో చేయాలని భావిస్తుంది.
అందుకే ఆమెకు ఇప్పుడు ఆఫర్లు తగ్గాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.అసలు విషయం ఏంటీ అనేది క్లారిటీ రావాల్సి ఉంది.







