ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది.ఎన్నికల దగ్గర పడే కొలది రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి.
మొన్నటి వరకు తెలుగుదేశం జనసేన మాత్రమే పొత్తు పెట్టుకోగా.ఇప్పుడు ఈ కూటమిలోకి బీజేపీ( BJP ) కూడా జాయిన్ కాబోతోంది.మరోసారి 2014లో గెలిచినట్టుగా 2024 ఎన్నికలలో గెలవాలని చంద్రబాబు భావిస్తున్నారు.2014 ఎన్నికలలో జనసేన.బీజేపీ.తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడడం జరిగింది.ఆ సమయంలో చంద్రబాబు ( Chandrababu )ముఖ్యమంత్రి అయ్యారు.ఇప్పుడు అదే రకంగా గెలవాలని భావిస్తున్నారు.
కాగా 2024 ఎన్నికలలో కూడా యధావిధిగా వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది.అయితే ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో నేతల మధ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లేటెస్ట్ గా ఏపీ బీజేపీ నాయకుడు సత్య కుమార్( Sathya Kumar ) మంత్రి పెద్దిరెడ్డి పై విమర్శలు చేశారు.ఎక్కడో పుట్టి ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఒప్పుకోరు అంటూ ఇటీవల పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాజాగా సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు.ఎక్కడ పుట్టారు.? ఎక్కడ పెరిగారని మీ నాయకుడి తల్లిగారిని విశాఖపట్నంలో పోటీ పెట్టారు? ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారని నెల్లూరు ఎమ్మెల్యేను నరసరావుపేట పంపారు?ఎక్కడ పుడితేనేం? ఎక్కడ పెరిగితేనేం? మీలాగ రాష్ట్రాన్ని దోచుక తినలేదు.జలగల్లాగా జనాల రక్తం పీల్చలేదు.ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్న నిబద్ధత కలిగిన కార్యకర్తను నేను.ఆంధ్రప్రదేశ్ ఏమైనా మీ సామ్రాజ్యం అనుకున్నారా? లేక బీసీలు అందరూ మీ బానిసలు అనుకున్నారా? ఎన్నికల తర్వాత మీ నాయకుడు జైలుకు పోవడం ఖాయం.మీరు మెక్కిన మైనింగ్ సొమ్ము కక్కించడమూ ఖాయమని సత్యకుమార్ ట్విట్టర్ లో సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది.