టిఆర్ఎస్ పై మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.మునుగోడుకు టిఆర్ఎస్ ఏమి ఇవ్వలేదని, తాను రాజీనామా చేయకపోయి ఉంటే మునుగోడు ఊసే ఉండేది కాదని విమర్శించారు.
అవినీతి సొమ్ముతో తనను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.మునుగోడు లో జరుగుతున్న యుద్ధంలో ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
మునుగోడు తీర్పు మీదే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు.మునుగోడులో బిజెపిని గెలిపిస్తే కేంద్రం నుంచి వెయ్యి కోట్ల నిధులు తీసుకొస్తానని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నుంచి హామీ తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు.