తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని ఆరోపించారు.
రాజకీయంగా ఎదుర్కోలేకనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ దుష్ఫ్రచారం చేశారని మండిపడ్డారు.దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు.
రాచరిక పాలన కొనసాగిస్తూ ప్రజలను వేధిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.







