సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి వృత్తిపరమైన జీవితంలో బిజీగా గడుపుతూ ఉంటారు.అయితే వారికి ఏ మాత్రం విరామం దొరికిన ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లడం హాలిడే వెకేషన్ లకు వెళ్లడం జరుగుతూ ఉంటుంది.
ఈ క్రమంలోనే టీమ్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ అనుష్క శర్మ దంపతులు తాజాగా ఉజ్జయిని ఆలయంలో సందడి చేశారు.ఇలా ఈ దంపతులు ఉజ్జయినిలోని మహా పరమేశ్వరుడిని దర్శనం చేసుకున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆస్ట్రేలియాతో భారత్ నాలుగవ టెస్ట్ మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కశర్మతో కలిసి మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయించారు.ఇండోర్‌లో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన 3వ టెస్ట్ మ్యాచ్ ముగిసిన ఒక రోజు తర్వాత కోహ్లీ దంపతులు శనివారం ఉదయం స్వామి వారి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలను నిర్వహించి ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఈ విధంగా ఆలయం గర్భగుడి బయట అనుష్క శర్మ విరాట్ కోహ్లీ దంపతులు ఉండగా పక్కన భక్తులందరూ కూడా ఈ పూజలో పాల్గొన్నట్టు తెలుస్తుంది.ఇక ఈ విషయాన్ని అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ మహాకాళేశ్వర ఆలయంలో దేవుడి దర్శనం చేసుకొని పూజలు చేశామని తెలియజేశారు.ఇక ఈ ఏడాది మొదట్లో కూడా అనుష్క శర్మ తన కుమార్తె వామికతో కలసి రిషికేశ్, బృందావన్ ను సందర్శించారు.
రిషికేశ్‌లో స్వామి దయానంద్ ఆశ్రమంలో స్వామి దయానంద్ జీ మహారాజ్ సమాధిని సందర్శించారు.ఇలా తరచూ తన కుటుంబంతో కలిసి అనుష్క శర్మ ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.







