నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ప్రజా సమస్యలే లక్ష్యంగా అసెంబ్లీలో బీజేపీ బాణాలు ఎక్కుపెట్టనుంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు హాజరుకానున్నారు.సభా వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ చెబుతోంది.
మరోవైపు గోషామహల్ రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ కొనసాగుతుండగా… సమావేశాలకు హాజరవుతానని ఆయన చెబుతున్నారని సమాచారం.