తెలంగాణ రాష్ట్రం అప్పులమయంగా మారిందంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు.కావాలనే తెలంగాణపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ అప్పులపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారన్న మంత్రి హరీశ్ రావు తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.వంద లక్షల కోట్ల అప్పు చేసింది కేంద్రమేనని వెల్లడించారు.
మోటార్లకు మీటర్లు పెట్టాలన్న బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు.మోటార్లకు మీటర్లు పెట్టాలని తెలంగాణపై కేంద్రం ఒత్తిడి చేసిందన్న ఆయన కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే మోటర్లకు మీటర్లు తప్పవని పేర్కొన్నారు.
దేశంలో రైతు పక్షపాతి అంటే ఒక్క కేసీఆరేనని తెలిపారు.రైతులకు కష్టం రాకుండా పక్షపాతిగా నిలబడ్డారని స్పష్టం చేశారు.
నిర్మలా సీతారామన్ బీజేపీ బండారం బయటపెట్టారని చెప్పారు.తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టేందుకు సీఎం కేసీఆర్ నిరాకరించారన్న మంత్రి హరీశ్ రావు మీటర్లు పెట్టలేదనే కేంద్రం రూ.25 వేల కోట్ల నిధులను ఆపిందని తెలిపారు.అయితే రైతుల ప్రయోజనాల కోసమే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.







