బీజేపీ డెసిషన్ టైమ్ ?

ఏపీలో రాజకీయల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టంగా మారింది.ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

 Bjp Decision Time,  Daggubati Purandeswari , Tdp , Bjp, Ap Politics , Chandra Ba-TeluguStop.com

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు పాలు అయిన తరువాత జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) అనూహ్యంగా టీడీపీతో పొత్తు ప్రకటించారు.దాంతో బీజేపీ పరిస్థితి డైలమాలో పడింది.

మొదటి నుంచి కూడా బీజేపీతో పొత్తులో ఉంటున్న జనసేన పార్టీ ఇప్పుడు టర్న్ తీసుకొని టీడీపీ పక్షాన చేరింది.కానీ కమలనాథులు మాత్రం పవన్ మావాడే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

Telugu Ap, Chandra Babu, Janasena, Lokesh-Politics

జేఎస్పీ తో బీజేపీ పొత్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.కానీ టీడీపీతో కలవడంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.ఇదిలా జరుగుతుండగా తాజాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పి కొత్త అనుమానాలకు తెర తీశారు.పవన్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీని పూర్తిగా పక్కన పెట్టేశారా అనే సందేహాలు రాక మానవు.

ఇప్పుడు సందేహం కమలనాథుల్లో కూడా ఆందోళన కలిగిస్తోందట.ఇక నెక్స్ట్ ఏం చేయాలనే దానిపై బీజేపీ కోర్ కమిటీ ( BJP )సభూలతో నేడు సమావేశం నిర్వహిస్తున్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి.

Telugu Ap, Chandra Babu, Janasena, Lokesh-Politics

ఈ సమావేశంలో మొత్తం 102 మందిని కార్యవర్గ సభ్యులుగా ఆమె నియమించారు.ఈ కోర్ కమిటీ సమావేశంలో అన్నీ విషయలపై కులాంకుశంగా చేర్చించాలని కమలనాథులు భావిస్తున్నారట.జనసేనతో పొత్తు( Jana sena ) కొనసాగించాలా లేదా అనే దానిపై కూడా ఈ సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.అలాగే పార్టీలో ఎలా ముందుకు సాగాలనే దానిపై కూడా ఈ సమావేశం ద్వారా వ్యూహరచన చేసే అవకాశం ఉంది.

మొత్తానికి పొత్తులో టీడీపీని మాత్రమే ప్రస్తావిస్తూ పవన్ బీజేపీని కన్ఫ్యూజన్ లో పడేశారు.దీంతో ఇటు జనసేన విషయంలోనూ టీడీపీ విషయంలోనూ బీజేపీ డెసిషన్ తీసుకోవాల్సిన సమయం ఏర్పడింది.

మరి బీజేపీ ఎలాంటి వ్యూహాలకు పదును పెడుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube