జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) వచ్చే ఎన్నికలపై గట్టిగా దృష్టిపెట్టారనే సంగతి అందరికీ తెలిసిందే.ఈసారి ఎలాగైనా ఏపీలో కింగ్ మేకర్ కావాలని కుదిరితే సిఎం కావాలని పవన్ కలలు కంటున్నారు.
అందుకు తగ్గట్టుగానే ఆయన వ్యూహరచన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇప్పటికే టీడీపీ( TDP ) తో పొత్తు ప్రకటించి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబతున్నట్టు స్పష్టం చేసిన పవన్ ఇక సీట్ల కేటాయింపుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
కాగా సీట్ల కేటాయింపులో కుల సమీకరణలు సర్వసాధారణం.వాటి ఆధారంగానే కేటాయింపు జరుపుతూఉంటారు అధినేతలు.

అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్..( Pawan Kalyan ) తాను కుల సమీకరణలు చేయనని చెబుతూ వుంటారు.తాను అన్నీ కులాలను సమానంగా చూస్తానని, కులభేశాలు లేవని చెబుతూ ఉంటారు.అయితే పవన్ చెప్పే ఆ తరహా వ్యాఖ్యలు కేవలం మాటల వరకేనా ఆచరణలో ఉండవా అంటే అవుననే వాదన వినిపిస్తున్నారు కొందరు.తాజాగా పవన్ కాపుల గురించి కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని వారి ఓటు బ్యాంకే కీలకం అన్న రీతిలో వ్యాఖ్యానిస్టు వచ్చారు.
ఇందులో కొంత వాస్తవమే అయినప్పటికి కాపుల పట్ల పవన్ మొదటి నుంచి కూడా నిర్లక్ష్య దొరని వ్యవహరిస్తున్నారనే భావన ఉంది.

సమయం వచ్చినప్పుడు వంగవీటి రంగా వంటివారి పేర్లు ప్రస్తావించడం.ఆ తరువాత వారి ప్రస్తావన ఎక్కడ తీసుకురాకపోవడం, కేవలం కాపులను ఓటు బ్యాంకు కోసమే అన్నట్లు పవన్( Pawan Kalyan ) వ్యహరిస్తున్నాడనే విమర్శలు రావడం వంటి కారణాలతో కాపు సామాజిక వర్గంలో పవన్ పై అవకాశవాది అనే ముద్ర కొంతమేర పడింది.దీంతో ఆ ముద్రాను చెరిపెసుకునేందుకు పవన్ ఇప్పుడు కాపుల ప్రస్తావన తెస్తున్నారనేది కొందరి అభిప్రాయం.
కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని చెబుతున్నా పవన్.వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి సీట్ల కేటాయింపు, వివిధ హామీల విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.
దీంతో పవన్ ను కాపులు ఎంతవరకు నమ్ముతారనేది ప్రశ్నార్థకమే.మరి తన సొంత సామాజిక వర్గంలో బలం నిలుపుకునేందుకు పవన్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారో చూడాలి.







