హైదరాబాద్ జలమండలి వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.తాగునీరు కలుషితం అవుతోందని బీజేపీ నిరసనకు దిగింది.
ఈ నేపథ్యంలో జలమండలి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ కార్పొరేటర్లు ప్రయత్నించారు.రంగంలోకి దిగిన పోలీసులు కార్పొరేటర్లను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.అనంతరం బీజేపీ కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు పీఎస్ కు తరలించారు.
అయితే నాలాలలో పూడిక తీయడం లేదని, అలాగే తొలగించిన పూడికను అక్కడి నుంచి తీయడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.







