బీజేపీ తెలంగాణలో దూకుడు పెంచేసింది.ఢిల్లీ పెద్దలు నిత్యం వచ్చిపోతున్నారు.
టీఆర్ఎస్ ను సవాల్ చేస్తూ కార్యక్రమాలను పెంచేశారు.నేతలూ వాయిస్ పెంచేశారు.
ఇప్పుడు ఇక బస్తీమే సవాల్ అంటోంది.ఇక దశల వారీగా బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రను చేపడుతూ వస్తున్నారు.
అధికారంలో ఉన్న పార్టీ మీద పెద్ద ఎత్తున లేస్తూ బస్తీమే సవాల్ అంటున్నారు.గత రెండేళ్లుగా చూస్తే బీజేపీ తాలూకా పొలిటికల్ యాక్టివిటీ బాగానే పెరిగింది.
ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున సభలూ సమావేశాలూ నిర్వహిస్తున్నారు.ఇంకో వైపు చూస్తే బండి సంజయ్ పాదయాత్ర అతి పెద్ద ఆర్థిక యాగంగానే చూడాలి.
పాదయాత్రలో కలసి నడిచే వారికి భోజనాదులతో సహా అన్ని రకాలుగా అవసరాలు చూసుకోవాలి.ఇక చిన్న చిన్న మీటింగ్స్ తో పాటు కూడళ్లలో సమావేశాలు సభలు జరుగుతున్నాయి.ఎలా చూసుకున్నా బండి సంజయ్ పాదయాత్ర ఖర్చు తడిసి మోపెడు అవుతోంది.
ఆర్థికంగా ఎలా??
బీజేపీ ఇప్పటిదాకా తెలంగాణలో పెద్దగా రాజకీయం చేసింది లేదు.కనీసం రెండు పదుల సీట్లు కూడా లేవు.మరి బీజేపీకి ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ అవుతుంటే దాన్ని ఎలా ఎవరు భరిస్తున్నారు అన్న చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ తీరు అయితే చాలా సార్లు అధికారంలో ఉన్నా కూడా మంత్రులుగా చేసిన వారు సైతం ఖర్చుకు వెనకడుగు వేస్తారు.ఇక అన్ని రకాలుగా బలంగా ఉన్నారు కాబట్టే రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇచ్చారని అంటుంటారు.
ఇక మరో వైపు అధికార పార్టీని తీసుకుంటే ప్రభుత్వమే చేతిలో ఉంది కాబట్టి వారు ఏమైనా చేయగలరు.మరి వారికి దీటుగా బీజేపీ చేయాలీ అంటే ఆర్థికంగా పుష్కలంగా ఉండాలి.
పైగా తెలంగాణాకు వచ్చే పోయే కేంద్ర పెద్దలు వారి సభలు మరింత భారం వేస్తాయి.మరి ఇంత ధనం ఎక్కడని నుంచి వస్తుంది.? అధిష్టానం ఎంతో కొంత సాయం చేసినా.బండి సంజయ్ పాదయాత్రకు నిధులు ఎలా సమకూరుతున్నాయి అన్నదే చర్చగా మరింది.
ఆ బడా మీడియా అధిపతులే!
అయితే దీనికి సమాధానంగా కొన్ని విషయాలు ప్రచారంలో ఉన్నాయని అంటున్నారు.ఇద్దరు బిగ్ షాట్స్ కలసి మీడియా అధిపతులుగా మారి ఇప్పుడు బీజేపీకి సానుకూలంగా ఉంటున్నారని… తెలంగాణలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆ ఇద్దరు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉండేవారట.అలాగే కన్స్ స్ట్రక్షన్ రంగంలో కూడా అగ్రస్థానంలో ఉండేవారట.అయితే వారు అధికార టీయారెస్ కి దగ్గరగా ఉండడంతో వారి మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టి మరీ కలవరం కలిగించాయని అంటున్నారు.ఒక వరసబెట్టి కీలక నేతల మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ ఇద్దరూ ముందు జాగ్రత్తగా బీజేపీకి దగ్గర అయ్యారని అంటున్నారు.
దాంతో ఈ ఇద్దరే ఇపుడు బండి సంజయ్ సభలకు యాత్రలకు అయ్యే ఖర్చుని భరిస్తున్నారని టాక్.ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ.
ఖర్చు మాత్రం ఎవరో ఒకరు పెట్టుకోవాల్సిందే కదా.!
.