ఎడిటోరియల్ : ఏపీ నుంచి బీజేపీ కోరుకుంటుంది ఏమిటి ? 

కేంద్ర అధికార పార్టీ బిజెపి క్లారిటీతో ఉందో , గందరగోళం లో ఉందో, మరే పరిస్థితుల్లో ఉందో ఎవరికీ అంతుపట్టడం లేదు.

కనీసం ఆ పార్టీ ఏపీ నాయకులకు కూడా బీజేపీ కేంద్ర పెద్దల వైఖరి అర్థం కావడం లేదు.

ఒకవైపు ఏపీలో బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తూ,  పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, ఆ పార్టీ పై జనాల్లో సదభిప్రాయం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తోంది.పూర్తిగా టిడిపి, అధికార వైసిపి ఈ రెండు తమకు రాజకీయ బద్ధ శత్రువులు అనే విషయాన్ని ఏపీ బీజేపీ నాయకులు పూర్తిగా నమ్ముతున్నారు.

ఈ మేరకు అధిష్టానం పెద్దల నుంచి ఇదేరకమైన సంకేతాలు వస్తుండటంతో మరింతగా దూసుకుపోతున్నారు.ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఉన్నా, ఆ పార్టీని దాటుకుని మరీ ముందుకు వెళ్లి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

అయితే కేంద్రంలో మాత్రం బిజెపి పెద్దలు వైసీపీతో వ్యవహరిస్తున్న తీరు, ఏపీ బిజెపి నేతలతో పాటు, వైసిపి, టిడిపి నాయకులకు అర్థం కావడం లేదు.జగన్ తీసుకున్న నిర్ణయాలకు మద్దతు పలుకుతూ, అన్ని విషయాల్లోనూ సహకరిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు.

Advertisement

అలాగే జగన్ సైతం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు పలుకుతూ, మీవెంటే మేము అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.కానీ ఏపీ కి వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతుంది.

ప్రస్తుతం బిజెపి జాతీయ కార్యవర్గంలో కి దగ్గుబాటి పురంధరేశ్వరి ని తీసుకున్నారు.

ఆ పదవికి ఆమె పేరు ప్రకటించగానే, ఆమె వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు మొదలుపెట్టడం, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆమెకు గట్టిగా కౌంటర్ ఇవ్వడం, ఎలా ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఏపీలో జనసేన పార్టీ సహకారంతో 2024 విజయం సాధించి ఉమ్మడిగా అధికారం పంచుకోవాలని చూస్తున్నాయి.కానీ జనసేన పార్టీని పెద్దగా కలుపుకుని వెళుతున్నట్లుగా కూడా కనిపించడం లేదు.

ఇప్పటికే ఆ పార్టీ వైఖరిపై జనసేన వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి.అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందా లేదా అనే విషయం లో కూడా ఎవరికీ క్లారిటీ రావడం లేదు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

అసలు బిజెపి అగ్రనేతలు మనసులో ఏముంది అనే విషయం కూడా ఎవరికీ అంతుపట్టడం లేదు.ఇంతగా ఏపీ విషయంలో దోబూచులాట ఆడుతుంది.? అసలు బిజెపి ఏపీ నుంచి ఏం కోరుకుంటుంది అనే విషయం ఎవరికి అర్థం కావడం లేదు.ఏపీలో అధికారం దక్కించుకోవాలనే తపన ఉంటే, దానికి తగ్గట్టుగానే వ్యవహారాలు చేయాలి.

Advertisement

కానీ కేంద్రంలో ఒక రకంగా, రాష్ట్రంలో ఒక రకంగా ప్రవర్తించడం బిజెపి లోని గజిబిజి రాజకీయాన్ని గుర్తు చేస్తున్నాయి అనే విమర్శలు లేకపోలేదు.మొన్నటి వరకు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ విషయంలోనూ ఇదే వైఖరిని అవలంబించింది.

కేంద్రం వైఖరిని పసిగట్టే కెసిఆర్ ఆ పార్టీ ట్రాప్ లో పడకుండా, ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు.

తాజా వార్తలు