బీఆర్ఎస్ కు పరోక్ష మిత్రపక్షంగా బీజేపీ..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన కేటీఆర్ ఆత్మస్తుతి, పరనింద నుంచి బయటపడాలని హితవు పలికారు.

 Bjp As An Indirect Ally Of Brs: Mlc Jeevan Reddy-TeluguStop.com

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కేటీఆర్ కానీ ఇతర బీఆర్ఎస్ నాయకులు కానీ అంగీకరించే పరిస్థితిలో లేరని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.పరనిందలను ఆపకపోతే కేటీఆర్ ప్రతిపక్ష హోదాలో కూడా ఉండరని చెప్పారు.

బీఆర్ఎస్ కు పరోక్ష మిత్రపక్షంగా బీజేపీ ఉందని పేర్కొన్నారు.లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవని చెప్పారు.

పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేయలేదని ధ్వజమెత్తారు.కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పెద్ద బోగస్ అన్న జీవన్ రెడ్డి కమీషన్ల కోసమే అలా చేసిందని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube