అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీపై కాంగ్రెస్, బిజెపిలు ఇదే అదనుగా విమర్శలతో మరింతగా బాదించ సాగాయి.కేజ్రీవాల్ ఎన్నికల ప్రయోగం పాలన వద్దకు వచ్చేసరికి వికటించిందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది .
పాలన అనేది లేశమైన లేక , ఆపైన చేతకాక అపరిపక్వ రాజకీయాలతో సమయం వృధా చేస్తున్నారని బిజెపి తీవ్రస్తాయిలో విరుచుకుపడింది.ఢిల్లీ ప్రజల పెట్టుకున్న ఆశలనుకేజ్రివాల్ వమ్ముచేసాడు అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు .మంచి పాలన అందిస్తారని ప్రజలు అధికారం కట్టబెడితే కేజ్రీవాల్ దుర్వినియోగం చేశారని పెక్కు ఇడుములు పాలు చేస్తున్నారని, మరో వైపు కాంగ్రెస్ దుయ్యబట్టుడులో మరింత ముందంజలో ఉన్నారు .కేజ్రీవాల్ నిజస్వరూపం ప్రజలకు పూర్తిస్థాయిలో తెలిసొచ్చిందని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ధ్వజమెత్తారు.శుష్కవాగ్దానాలు, చౌకబారు రాజకీయాలకే కేజ్రీవాల్ పరిమితి అయ్యారు.ఇక చీలికలు పీలికలు కావడమో కుప్పకూలడమే ఆలస్యం అని సింఘ్వీ అభిప్రాయ పడ్డారు.కేజ్రీవాల్ ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి.ఏ క్షణమైనా ఆమ్ఆద్మీ సర్కార్ చీలిపోయే పరిస్తితులు ఉన్నాయి .తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి.లేకుంటే ఒకవైపు పార్టీలో కుమ్ములాటలు మరోవైపు జనాల్లో పెద్దయెత్తున నిరసనలు కేజ్రీకి తప్పవు అని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.
కేజ్రీవాల్ తీరుతో ఢిల్లీ పౌరులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది .ఆమ్ ఆద్మీ పార్టీలో కలహాలు అంత తక్కువగా చూడలేమని కేజ్రీ సమర్థవంతమైన పాలన పారిపాలన అందిస్తాడా అన్న అనుమానం ప్రజల్లో తలెత్తుతోందని ఏఐసిసి షకీల్ అహ్మద్ ఎద్దేవా చేశారు.







