తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీగా ఖర్చు చేసి నిర్మించిన సచివాలయం నిర్మాణం పూర్తి అయింది.మరో వారం రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతుంది.
దేశ వ్యాప్తంగా ప్రముఖ పార్టీలకు చెందిన నాయకులను మరియు ప్రజా సంఘాల ముఖ్య నేతలను సచివాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ( Cm KCR )మరియు మంత్రులు ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తోంది.

రాష్ట్ర సచివాలయం నిర్మాణం మరియు అతిథుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తే సామాన్యులకు కనీసం లోనికి వెళ్లే అవకాశం కూడా లేదని తెలుస్తోంది.కార్లలో వెళ్లే సెలబ్రిటీలు వీఐపీలు ధనవంతుల కోసం మాత్రమే తెలంగాణ సచివాలయం గేట్లు తెరుచుకుంటాయని కూడా కొందరు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
సామాన్యులకు కనీసం లోనికి ఎంట్రీ దక్కే అవకాశం లేదని ఇలా అయితే సామాన్యులు తమ సమస్యలను మంత్రుల వద్దకు ముఖ్యమంత్రి వద్దకు ఎలా తీసుకొస్తారని కాంగ్రెస్ నేతలు మరియు బిజెపి ( BJP )నేతలు ప్రశ్నిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సామాన్యులు తమ సమస్యల పరిష్కారం కోసం సచివాలయానికి రావాల్సి ఉంటుంది.అలాంటి వారు చాలా దూరం నుండి వచ్చినప్పుడు కనీసం సౌకర్యాలు లేకపోతే వాళ్ల పరిస్థితి ఏంటి అంటూ విపక్ష పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్( Brs party ) పాలన ప్రభావాన్ని చూపించడం కోసమే ఇలాంటి కట్టడాలు కానీ ప్రజలకు ఉపయోగం ఏమీ లేవు అంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు.మొత్తానికి తెలంగాణ సచివాలయం గురించి అధికార పార్టీ నాయకులు గొప్పగా చెబుతూ ఉంటే విపక్ష పార్టీ నాయకులు మాత్రం విమర్శల మీద విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా లేదా అనేది ప్రారంభోత్సవం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నిర్మాణం కోసం అత్యంత ఆధునిక టెక్నాలజీని వాడుతున్నట్లుగా తెలుస్తోంది.







