తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డికి చేదు అనుభవం సొంత శ్రేణులు నుండే ఎదురయ్యింది… సొంత పార్టీ వారే ఎమ్మెల్యే కారును అడ్డగించి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం విశేషం.భీష్మ ఏకాదశి సందర్భంగా గొల్లల మామిడాడ గ్రామంలో సూర్య భగవానుని రథోత్సవ కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు హాజరయ్యారు రథోత్సవం అనంతరం సొంత పార్టీ వారే ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి దగ్గరికి వచ్చి ఈరోజు స్కిల్ గేమ్స్ కు పర్మిషన్ ఇప్పించాలంటూ కోరారు.
దీనితో ఎమ్మెల్యే పర్మిషన్కు ససేమెరా అనడంతో సొంత పార్టీ నుండే నిరసన సెగ తగిలింది… సొంత కార్యకర్తలే ఎమ్మెల్యే కారును ముట్టడించి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేను ముందుకు సాగనివ్వలేదు దీంతో రంగంలో దిగిన పోలీసులు కారుని అడ్డగిస్తున్న వారిని చదరగొట్టి పోలీస్ ఎస్కార్ట్ తో ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని ఇంటికి పంపారు…
.