ఖమ్మం, జూలై 28: జిల్లాలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచేలా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి.
గౌతమ్ అన్నారు.గురువారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో ఈ నెలలో (జూలై 2022) ఎక్కువ ప్రసవాలు చేసిన వైద్యాధికారులను కలెక్టర్ శాలువాతో సత్కరించి, మెమెంటో, ప్రశంసాపత్రo అందజేశారు.
ఎంవి పాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా.జి.శ్రీదేవి 11, పరిగలపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా.జి.రాజు 11, తల్లాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా.సిహెచ్.జ్యోతి 13 ప్రసవాలు చేశారని కలెక్టర్ అభినందించారు.ప్రసవాల గురించి వారు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులతో పాటు, పల్లె దవాఖానాల వైద్యాధికారులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ అన్నారు.ఆరోగ్య కేంద్రాల్లో కావాల్సిన సదుపాయాలు, పరికరాల గురించి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
మెరుగైన సేవలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమ్మకం పెంచాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. బి.మాలతి, ఉప జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా.రాంబాబు, పీవో ఎంసిహెచ్ డా.సైదులు, ప్రోగ్రాం అధికారిణి డా.నిలోహన తదితరులు వున్నారు.–
.