తడగొండ గ్రామంలో ఘనంగా బీరప్ప కామరాతి ఉత్సవాలు.

రాజన్న సిరిసిల్ల జిల్లా :గొల్ల కురుమల ఆరాధ్య దైవము అయినా బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవంలో భాగంగా తడగొండ గ్రామంలో కురుమ కులస్తులు వైభవంగా నిర్వహిస్తున్న బీరప్ప కామరాతి ఉత్సవాల్లో భాగంగా శనివారం గంగ బోనం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు .

ఈ సందర్భంగా బీర్ల పూజారుల విన్యాసాలు తిలకించేందుకు గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలు హాజరయ్యారు.

తడగొండ గ్రామంలో పురవీధుల గుండా బోనాన్ని తరలించే కార్యక్రమంలో భాగంగా బీర్ల పూజారుల విన్యాసాలు పలువురిని ఆకర్షించాయి.ఈ బీరప్ప కామరాతి ఉత్సవాలు వారం రోజులపాటు జరుగుతాయని కురుమ కులస్తులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి సర్పంచ్ చిందం రమేష్ తో పాటు ఉపసర్పంచ్, కురుమ కులస్తులు, గ్రామస్తులు హాజరయ్యారు.

నాగ చైతన్య కి అదే మైనస్ గా మారుతుందా..?
Advertisement

Latest Rajanna Sircilla News