సోమవారం టెస్ట్ కూడా పాస్ అయిన 'బింబిసార'.. 4వ రోజు ఎంత రాబట్టిందంటే?

మన టాలీవుడ్ కష్టకాలంలో ఉండగా ఆ పరిస్థితులను మార్చి మళ్ళీ బాక్సాఫీస్ కళకళ లాడేలా చేయడంలో ఒక రెండు సినిమాలు పాల్పడ్డాయి.ఒక్క సూపర్ హిట్ పడినా చాలు అనుకుంటున్న సమయంలో రెండు హిట్ సినిమాలు రావడం ప్రేక్షకులకు కూడా కొత్త ఉత్తేజాన్ని కలిగించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Bimbisara Passes The Monday Test Details, Bimbisara Collections,kalyan Ram , Bim-TeluguStop.com

మరి గత వారం వచ్చిన రెండు సూపర్ హిట్ సినిమాల్లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార ఒకటి.పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి తెరకెక్కించారు.

అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అలాగే వసూళ్ల పరంగా కూడా టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ఆశ్చర్య పరుస్తుంది.

Telugu Bimbisara, Catherine Tresa, Vasisth Malladi, Kalyan Ram, Kalyanram, Samyu

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రిలీజ్ అయినా మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసి లాభాల బాట పట్టింది.వీకెండ్ లో అదరగొట్టిన బింబిసార సోమవారం టెస్ట్ లో కూడా సక్సెస్ అయ్యింది.నిన్న కూడా ఈ సినిమాను అన్ని వర్గాల వారు ఆసక్తిగా చూసారు.

Telugu Bimbisara, Catherine Tresa, Vasisth Malladi, Kalyan Ram, Kalyanram, Samyu

దీంతో ఈ సినిమా కీలకమైన సోమవారం టెస్ట్ లో కూడా పాస్ అయినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.నిన్న బింబిసార అదే అదిరే వసూళ్లను రాబట్టింది.నాలుగవ రోజు 2.24 కోట్ల షేర్ రాబట్టగా.ఇప్పటి వరకు ఈ సినిమా 18.2 కోట్ల షేర్ అందుకుంది.ఈ వసూళ్లు చూస్తుంటే ఇప్పట్లో స్పీడ్ ఆగేలా లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube