ఇండియాలో బైకింగ్ క్వీన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.సూరత్ కి చెందిన కొంత మంది మహిళలు బైక్స్ తో చాలెంజింగ్ రైడ్స్ చేస్తూ తమ సత్తా చూపిస్తూ ఉంటారు.
అప్పుడప్పుడు ఈ టీం మొత్తం విదేశాలు కూడా బైక్స్ పై లాంగ్ రైడ్ కి వెళ్తూ ఉంటారు.ఇక వీరు రైడింగ్ చేసిన ప్రతి సారి ఏదో ఒక యునిక్ థీంతో జర్నీ చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బైకింగ్ క్వీన్స్ మరో వినూత్న ప్రయత్నంకి సిద్ధం అయ్యారు.మూడు ఖండాలు, 25 దేశాలు బైక్స్ పై యాత్ర చేసేందుకు సిద్ధం అయ్యారు.
మహిళల గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పే ఉద్దేశంతో బైకింగ్ క్వీన్స్ టీం కి చెందిన ముగ్గురు మహిళలు మూడు ఖండాల్లోని 25 దేశాలను బైక్‌పై చుట్టి రానున్నారు.
నారీ గౌరవ్ అనే నినాదాన్ని ప్రపంచమంతా మహిళా శక్తిని విస్తరింపజేయాలనేది తమ లక్ష్యమని డాక్టర్ సరితా మెహతా, జినాల్ షా, రుతల్ పాటేల్ వివరించారు.
బైకింగ్ క్వీన్ గ్రూపును నెలకొల్పిన డాక్టర్ సరితా మెహతా జూన్ 5 న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో వారణాసి నుంచి బైక్ యాత్ర చేపట్టనున్నారు.ఇక్కడి నుంచి 25 దేశాల మీదుగా వీరి ప్రయాణం సాగనుంది.23 దేశాల్లో వివిధ చోట్ల భారతీయ కుటుంబాలను, బైక్ కమ్యూనిటీలను, భారత దౌత్య కార్యాలయాలు, హై కమిషనర్‌లను కలుస్తూ వీరు ముందుకు సాగుతారు.మహిళల బైక్ యాత్ర భారత్‌లో మొదలై నేపాల్, భూటాన్, మయన్మార్, లావోస్, చైనా, కిర్జిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, రష్యా, లాట్వియా, పొలెండ్, సీజెక్ రిపబ్లిక్, జర్మనీ, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్, మొరాకో దేశాలలో సాగుతుంది.







