ఎన్ఆర్ఐలారా మీ రాష్ట్రం కోసం ఆలోచించండి: బీహార్ డిప్యూటీ సీఎం ఉద్వేగం

ప్రస్తుతం భారత్‌లోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలను భాగస్వాములను చేయాలని భావిస్తున్నాయి.

దీనిలో భాగంగా ప్రవాస భారతీయులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి.

ఈ క్రమంలో బీజేపీ ఎన్ఆర్ఐ మంచ్ తరపున పాట్నాలోని జ్ఞాన్ భవన్‌లో ‘‘ నాన్ రెసిడెంట్ బిహారీ సమ్మేళన్’’ను నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ పాల్గొన్నారు.విదేశాలలో స్థిరపడిన/ పనిచేస్తున్న బీహార్ పౌరులు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు.సన్ ఆఫ్ ది సాయిల్ అనే నైతిక బాధ్యతతో పాఠశాలలను దత్తత తీసుకోవడం, ఆసుపత్రులను ఏర్పాటు చేయడం, అభివృద్ది కోసం మిషనరీలను నెలకొల్పాలని మోడీ సూచించారు.

అనేక దేశాలలో పనిచేస్తున్న బీహార్ ఫౌండేషన్‌లో చేరాలని, ఇందుకోసం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయించుకోవాల్సిందిగా కోరారు.బాగా సంపాదించడానికి రాష్ట్రం లేదా దేశం నుంచి బయటకు వెళ్లినవారిని వలస వెళ్లినట్లుగా నిర్వచించరాదని సుశీల్ అన్నారు.

Advertisement

అదే సమయంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్ ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు మంచి సంపాదన కోసం ఇంగ్లాండ్, అమెరికా, కెనడా తదితర దేశాలకు వెళతున్నారు.అంటే ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదా.? అని మోడీ ప్రశ్నించారు.గ్లోబల్ మైగ్రేషన్ గణాంకాలను బట్టి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో 1.75 కోట్ల మంది భారతీయులు పనిచేస్తున్నారని మోడీ తెలిపారు.

ఆర్‌బీఐ సర్వే ప్రకారం.2018లో ఎన్నారైలు 78.6 బిలియన్ డాలర్లను భారతదేశానికి పంపారు.2016-17లో ఎన్నారైలు కేరళ ఆర్ధిక వ్యవస్థలో 19 శాతం, మహారాష్ట్రలో 17 శాతం, బీహార్‌లో 1.3 శాతం సహకారం అందించినట్లు సుశీల్ మోడీ గుర్తుచేశారు.ఎన్డీఏ పాలనలో బీహార్‌‌లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రస్తావిస్తు.1961లో శ్రీకృష్ణ బాబు మరణం తర్వాత రాష్ట్రంలో గత 40 సంవత్సరాలుగా అభివృద్ధిలో స్తబ్దత నెలకొందన్నారు.అయితే ఎన్‌డీఏ పాలనలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని చూడటం ప్రారంభించామన్నారు.

ఆర్జేడీ హయాంలో బీహార్ సగటు వృద్ధి రేటు 5 శాతానికి దగ్గరగా ఉంటే.ఎన్‌డీఏ హయాంలో 10 శాతానికి చేరిందన్నారు.

-- .

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు