వెనక్కి తగ్గిన బీహార్ సీఎం నితీశ్ కుమార్.. మోడీ, షాలకు ఎదురు నిలబడేదెవరు?

దేశంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారుతూనే ఉన్నాయి.2024 ఎన్నికల్లో ప్రధాని మోడీని ఢీకొట్టే నేత ఎవరని ప్రస్తుతం దేశం మొత్తం ఎదురుచూస్తోంది.కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ఉంటారని అంతా అనుకుంటున్నారు.కానీ ఆయన్ను ప్రధానిగా చూసేందుకు దేశప్రజలు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది.దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది.సరైన నాయకత్వం లేక హస్తం పార్టీ అష్టకష్టాలు పడుతోంది.

 Bihar Cm Nitish Kumar Who Backed Down.  Who Will Stand Against Modi And Shah?, N-TeluguStop.com

అన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోతోంది.ప్రస్తుతం రాజస్థాన్, చత్తీస్ గఢ్ మినహా ఆ పార్టీ ఎక్కడా అధికారంలో లేదు.

ప్రధాని రేసులో సీఎం నితీశ్ లేనట్టేనా.

మొన్నటివరకు బీహార్‌లో ఎన్డీయే కూటమితో జట్టు కట్టిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తాజాగా ఆ కూటమి నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష ఆర్జేడీ కూటమితో పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.అనంతరం మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.బీహార్ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.నరేంద్రమోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.రాబోయే ఎన్నికల్లో బీజేపీకి కేవలం 50 సీట్లు మాత్రమే వస్తాయని సంచలన కామెంట్స్ చేశారు.

దీంతో నేషనల్ మీడియా ఒక్కసారిగా ఆయన కామెంట్స్‌ను ఫోకస్ చేశాయి.ఇదే టైంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ వెళ్లి కేంద్రంలో కొత్త రాజకీయ నాయకత్వం అవసరం ఉందని నొక్కి చెప్పారు.

సీఎం నితీశ్ కుమార్ ప్రధాని రేసులో ఉంటే ఆయనకు మద్దతు ఇస్తానని చెప్పినట్టు కూడా తెలుస్తోంది.

Telugu Amith Shah, Chhattisgarh, Congress, Modi, Nitish Kumar, Rajasthan-Politic

మొన్నటివరకు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ,ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లాంటి వారు స్కెచ్ వేశారు.సీఎం కేసీఆర్ కూడా థర్డ్ ఫ్రంట్ పేరుతో నానా హంగామా చేశారు.జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని పార్టీల నేతలను కలువడం.

వ్యవసాయసంఘాల నాయకులతో కలిసి కూడా మీటింగులు నిర్వహించారు.బిహార్లో మరణించిన రైతులు, సైనికుల కుటుంబాలకు పరిహారం అందజేయడం చేసి నితీశ్ కుమార్‌తో సమావేశం నిర్వహించారు.

అనంతరం నితీశ్ కుమార్ బీజేపీకి 50కు మించి సీట్లు రావని చేసిన కామెంట్స్ పై వెనక్కి తగ్గారు.తాను అనని మాటల్నిఅన్నట్లుగా ప్రచారం చేశారని నితీశ్ యూటర్న్ తీసుకున్నారు.

దీంతో మోషా ద్వయానికి నితీశ్ కుమార్ కూడా భయపడ్డాడని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube