మొబైల్ మిల్క్ ఏటీఎంలు వచ్చేసాయ్‌.. ఇకపై బయటికి వెళ్లాల్సిన పనిలేదు!

పాలు ( Milk ) డెలివరీ చేసే ఏటీఎం గురించి ఎపుడైనా విన్నారా? పాల ఏటీఎమ్‌( Milk ATM ) చాలా నగరాల్లో వున్నాయి.మనకి పలు కావాలనుకున్నప్పుడు మనమే అక్కడకు వెళ్లీ పాలు తీసుకోవాల్సి ఉంటుంది.

 Bihar Bhagalpur Man Develops Mobile Milk Atm Details, Milk Atms, Technology News-TeluguStop.com

అయితే ఇది మొబైల్ మిల్క్‌ ఏటీఎం.( Mobile Milk ATM ) అంటే పాలు మన దగ్గరకే వస్తాయి.

పాల ఏటీఎంల సర్వీసులు దేశవ్యాప్తంగా మొదలయ్యే రోజులు అతి దగ్గరలోనే ఉన్నట్టు తెలుస్తోంది.బీహార్‌కు చెందిన వినయ్‌ భాగల్‌పూర్‌లో మిల్క్ ఏటీఎంను ప్రారంభించాడు.

వినయ్ గతంలో ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేశాడు.తరువాత ఉద్యోగం మానేసిన తర్వాత మొదట్లో ఏడాది పాటు పలు విషయాలపై పరిశోధనలు చేశారు.

ఈ క్రమంలోనే అతనికి ఈ మిల్క్‌ ఆలోచన వచ్చింది.ఈ మొబైల్ మిల్క్ ఏటీఎం భాగల్‌ఫూర్‌ నగరంలోని అన్ని ప్రాంతాలకు నిర్ణీత సమయంలో చేరుకుంటుంది.మొబైల్ మిల్క్ ఏటీఎం ఒక స్టార్టప్ ప్రోగ్రామ్ అని వినయ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.మిల్క్ ఏటీఎం ఆలోచన టీవీ నుంచి వచ్చిందని వినయ్ చెప్పాడు.ఆ తర్వాత సబూర్ అగ్రికల్చరల్ కాలేజీలో శిక్షణ తీసుకుని పాల ఏటీఎంను ప్రారంభించాడు.మా పాల ఏటీఎంల ద్వారా ప్రజల్లో విశ్వసనీయత ఏర్పడిందంటున్నాడు వినయ్‌.

కొన్ని హోటళ్లలో పాలు సరఫరా చేస్తామని.పాల నాణ్యత విషయంలో మేం రాజీపడమంటున్నాడు.

కాగా పాల ఏటీఎంల నుంచి లీటరు పాలను రూ.48కే సరఫరా చేస్తుండడం విశేషం.అదే సమయంలో హోమ్ డెలివరీ కింద పాల ధర లీటరుకు రూ.52గా నిర్ణయించారు.ఇకపోతే బటన్ నొక్కితే పాలు వచ్చే ఏటీఎంలు మనదగ్గర కూడా అందుబాటులోకి వచ్చేశాయి.హైదరాబాద్‌లో తొలిసారిగా మిల్క్ ఏటీఎంలను ప్రారంభించారు.రాష్ట్రంలోనే ఫస్ట్ పాల ఏటీఎం ను శ్రీ గీతా డెయిరీ చైర్మన్ లక్ష్మీనరసింహగుప్తా ఏర్పాటు చేయడం జరిగింది.హైదరాబాద్ ఎల్బీనగర్‌ పరిధిలో ఉన్న హస్తినాపురం డివిజన్‌ హనుమాన్‌నగర్‌ చౌరస్తాలో పాల సరఫరా ఏటీఎం కేంద్రం కొన్ని నెలల క్రితం అందుబాటులోకి తెచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube