ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసాడు.ఈయన డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి.ఈ సినిమా తో పుష్పరాజ్ క్రేజ్ వరల్డ్ వైడ్ వైరల్ గా మారింది.
ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
పార్ట్ 1 అన్ని కోట్లు కలెక్ట్ చేయడంతో ఇప్పుడు పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.అందుకే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట.
ఇంటా బయట కూడా దుమ్ములేపిన ఈ సినిమా పార్ట్ 2 కోసం అంతా సిద్ధం చేస్తున్నారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రిపరేషన్ లో ఉన్నాడు అని తెలుస్తుంది.
పుష్ప 2 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి టీమ్ అంతా సిద్ధంగా ఉంది.హిందీలో పార్ట్ 1 100 కోట్ల మార్క్ టచ్ చేసి సంచలనం సృష్టించింది.

దీంతో సౌత్ సినిమాలకు ఊపునిచ్చింది.ఇక ఇటీవలే కెజిఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అయినా విషయం తెలిసిందే.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకు బాక్సాఫీస్ వసూళ్లను కూడా అదే స్థాయిలో చేస్తుంది.ఈ సినిమా మొదటిరోజు 53 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.

అయితే ఇప్పుడు పుష్ప 2 పై ఆసక్తికర చర్చ స్టార్ట్ అయ్యింది.పుష్ప నార్త్ హిందీ బెల్ట్ లో భారీ వసూళ్లను రాబట్టింది.పుష్ప 2 రాబోతున్న నేపథ్యంలో తాజాగా కెజిఎఫ్ 2 క్రియేట్ చేసిన రికార్డులను తిరగ రాయడం ఖాయం అంటున్నారు.ఎలాంటి ప్రచారం లేకుండానే 100 కోట్లు రాబట్టింది.
అదే ప్రొమోషన్స్ చేస్తే భారీ వసూళ్లు రావడం ఖాయం అంటున్నారు.దీంతో మేకర్స్ కూడా కొత్త టార్గెట్ సెట్ చేసుకుంటున్నారు.
మరి కెజిఎఫ్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.