ఆ మూడు రోజులు మమ్మల్ని వదిలేయండి... బిగ్ బాస్ సన్నీ కామెంట్స్ వైరల్!

వీజే సన్ని( VJ Sunny ) పరిచయం అవసరం లేని పేరు.కెరియర్ మొదట్లో యాంకర్ గా పనిచేసినటువంటి సన్నీ అనంతరం బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Biggboss Vj Sunny Comments On Movie Reviewers , Vj Sunny, Unstoppable, Arun, Big-TeluguStop.com

ఇలా బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి ఈయనకు బిగ్ బాస్( Bigg Boss ) అవకాశం వచ్చింది.ఇలా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలో సందడి చేసిన సన్నీ అనంతరం ఈ కార్యక్రమంలో టైటిల్ గెలుచుకొని విజేతగా నిలబడ్డారు.

విజేతగా నిలిచినటువంటి సన్నీ అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

Telugu Arun, Bigg Boss, Unstoppable, Vj Sunny-Movie

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ఈయన అన్ స్టాపబుల్ ( Unstoppable ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన స్టైల్ లో ప్రేక్షకులను నవ్వించారు.ఇకపోతే తాజాగా సన్నీ అభినవ్ సర్దార్ నటించిన మిస్టేక్ సినిమా ట్రైలర్ లాంచ్ ఆదివారం నాడు జరగగా హీరో శ్రీకాంత్ గెస్ట్ గా వచ్చారు.ఈ కార్యక్రమంలో సన్ని కూడా పాల్గొన్నారు.

అయితే ఈయన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తన పేరు విజె సన్నీ అనే విషయం అందరికీ తెలిసిందే.కానీ తన అసలు పేరు అరుణ్ ( Arun ) అని తెలియజేశారు.

ఇకపై అరుణ్ గానే మీ ముందుకు వస్తాను అంటూ ఈయన తెలియచేశారు.

Telugu Arun, Bigg Boss, Unstoppable, Vj Sunny-Movie

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సన్నీ సినిమాల గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.ప్రస్తుత కాలంలో చిన్న సినిమాలకు లైఫ్ చాలా తక్కువగా ఉందని తెలిపారు.సినిమా విడుదలైన మూడు రోజులు మాత్రమే చిన్న సినిమాలకు లైఫ్ అని ఆ మూడు రోజులు రివ్యూ( Review ) రాసేవారు పూర్తిగా మమ్మల్ని వదిలేయండి అంటూ రిక్వెస్ట్ చేసుకున్నారు.

ఈ మూడు రోజులు తర్వాత మీరు మీకు ఇష్టం వచ్చిన విధంగా సినిమా గురించి రివ్యూ రాయండి మాకు ఎలాంటి సమస్య లేదు కానీ సినిమాకు ఎంతో ముఖ్యమైన ఆ మూడు రోజులు మాత్రం ఎవరు రివ్యూలు ఇవ్వకుండా ఉండండి చిన్న సినిమాలను కూడా ఆదరించండి అంటూ ఈ సందర్భంగా సన్నీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube