బిగ్ బాస్ సీజన్ సెవెన్ ( Bigg Boss 7 ) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే సందడి చేసినటువంటి వారిలో బుల్లితెర నటి శోభా శెట్టి ( Shobha Shetty) ఒకరు.ఈమె ఈ కార్యక్రమంలో పాల్గొనక ముందు పలు సీరియల్స్ లో నటించి మెప్పించారు.
ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్ లో విలన్ పాత్రలో నటించినటువంటి శోభా శెట్టికి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది.ఇదే క్రేజ్ ద్వారా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో 14 వారాలపాటు కొనసాగినటువంటి ఈమె 14వ వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు.
శోభా శెట్టి బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలోనే ఈమె ప్రేమ విషయం కూడా బయటపడింది.శోభా శెట్టి ఎవరికీ తెలియకుండా బుల్లితెర నటుడు యశ్వంత్ రెడ్డి( Yaswanth Reddy ) ని ప్రేమిస్తూ ఉన్నారు దాదాపు మూడు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట తమ ప్రేమ విషయాన్ని ఎక్కడ బయటపడనివ్వలేదు కానీ నాగార్జున మాత్రం శోభాశెట్టి ప్రియుడిని అందరికీ పరిచయం చేసి వీరి ప్రేమాయణం బయటపెట్టారు.యశ్వంత్ రెడ్డి కూడా బుల్లితెర నటుడు అనే విషయం మనకు తెలుసు.
కార్తీకదీపం సీరియల్( Karthika Deepam ) లో డాక్టర్ బాబు తమ్ముడు పాత్రలో యశ్వంత్ రెడ్డి నటించారు.
ఇలా గత మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటామని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే చెప్పారు.అయితే ఈ ఏడాది తన పెళ్లి జరుగుతుందని శోభ శెట్టి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంటర్వ్యూలలో వెల్లడించారు అయితే తాజాగా ఈమె కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇందులో భాగంగా యశ్వంత్ రెడ్డితో తాను నిశ్చితార్థం( Shobha Shetty Engagment ) జరుపుకున్నారని తెలుస్తోంది.
అయితే వీరిని నిశ్చితార్థానికి ఇతర బుల్లితెర సెలబ్రిటీలు ఎవరు హాజరు కాకపోవడం గమనార్హం.ఈ నిశ్చితార్థపు వేడుక బెంగుళూరులో జరిగిందని తెలుస్తోంది.ప్రస్తుతం వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.మరి మీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది.