Biggboss Arjun kalyan: బిగ్‌బాస్‌ : ఆమె విషయంలో పుసుక్కున నోరు జారి, ఇప్పుడు కాదంటున్నాడు

తెలుగు బిగ్ బాస్ నుండి గత వారం బయటికి వచ్చిన అర్జున్ కళ్యాణ్ బయటకు వస్తూ వస్తూ తాను కేవలం శ్రీ సత్య కోసమే హౌస్ లోకి వెళ్ళానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఇద్దరిది కూడా విజయవాడ, పలు సందర్భాల్లో ఇద్దరం కలిసాం.

 Biggboss Arjun Kalyan Comments About Sri Satya , Sri Satya, Biggboss , Arjun Kal-TeluguStop.com

ఆమె అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది.శ్రీ సత్య కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని తెలిసి నేను కూడా ట్రై చేశాను.

శ్రీ సత్య తో ఎక్కువ సమయం బిగ్ బాస్ లో ఉండవచ్చు అని ఉద్దేశం తో నేను బిగ్ బాస్ కి వచ్చాను అంటూ అర్జున్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్య పరిచాయి.తాజాగా ఆ వ్యాఖ్యలను అర్జున్ కళ్యాణ్ వెనక్కి తీసుకున్నాడు.

శ్రీ సత్య కోసం వెళ్ల లేదు అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Telugu Arjun Kalyan, Big Boss, Biggboss, Telugu Biggboss-Movie

ఇండస్ట్రీ లో అడుగు పెట్టడం కోసం.తనకంటూ ఒక గుర్తింపు దక్కించుకోవడం కోసం మాత్రమే నేను బిగ్ బాస్ కి వెళ్ళానని.ఎవరి కోసమో బిగ్ బాస్ కి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది.మాట్లాడిన మాటలు మరియు హౌస్ లో వ్యవహరించిన తీరు ఇవన్నీ చూస్తుంటే కేవలం శ్రీ సత్య కోసమే బిగ్ బాస్ హౌస్ కి అర్జున్ కళ్యాణ్ వెళ్ళాడు అంటూ పేక్షకులు ఒక నిర్ణయానికి వచ్చేసారు.

అదే మాట అతను కూడా అనడం తో అంతా అర్జున్ కళ్యాణ్ ఒక సీరియస్ నెస్ లేని వ్యక్తి, అమ్మాయి కోసం బిగ్ బాస్ కి వెళ్ళాడు.అక్కడ ఆమె కోసం ప్రాకులాడి ఆట ఆడకుండా వెనక్కి వచ్చేసాడు అంటున్నారు.

అర్జున్ కళ్యాణ్ ఒక కన్ఫ్యూజ్డ్‌ వ్యక్తి అంటూ కూడా జనాలు అతడి పై విమర్శలు చేస్తున్నారు.హీరో గా ఒకటి రెండు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయంటూ ఆ మధ్య చెప్పిన అర్జున్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏ ఒక్కటి చేయలేదు ముందు ముందు చేస్తాడో లేదో కూడా తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube