కోలీవుడ్ హీరోయిన్ గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజీమా మోహన్ మధ్య ఏదో జరుగుతుంది ఏదో ఉంది అంటావు గత కొంతకాలంగా వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే అందుకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవ్వడంతో ఆమధ్య ఒకసారి ఆ వార్తలపై స్పందించిన మంజీమా మోహన్.
అతని ప్రేమను అంగీకరించలేదు ఒకవేళ నిజంగా లవ్ లో పడితే ఖచ్చితంగా ఆ విషయాన్ని అందరికి చెబుతాను అంటూ స్పందించింది.అయితే చివరికి సోషల్ మీడియాలో వినిపించిన వార్తలే నిజం అయ్యాయి.
తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రేమ వ్యవహారం గురించి స్పందించింది.
తాజాగా ఆమె తన ప్రేమ గురించి స్పందిస్తూ గౌతమ్ కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది.
మూడేళ్ల క్రితం నా జీవితంలోకి అడుగు పెట్టావు.లైఫ్ ని ఎలా చూడాలో నేర్పించావు.
దిక్కుతోచని స్థితిలో పరిస్థితులు ఎదురైనా ప్రతిసారి అందులో నుంచి నన్ను బయటకు తీసుకు వచ్చావు.నా మీద ఎంతో ప్రేమను కురిపించావు.
అందుకే నీతో లవ్ లో పడిపోయాను.నువ్వు ఎప్పటికీ నాకు ప్రత్యేకమే అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది మంజీమా మోహన్.
అంతేకాకుండా ఈ సందర్భంగా గౌతం కార్తీక్ తో దిగిన ఫోటోని కూడా షేర్ చేసింది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంతేకాకుండా ఆ ట్వీట్ ని చూసిన పలువురు నెటిజన్స్ దానిపై స్పందిస్తూ ఆ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇంకొందరు మాత్రం సోషల్ మీడియాలో వినిపించిన వార్తలే నిజమయ్యాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే మంజీమా మోహన్ సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
కాగా గౌతమ్ కార్తీక్ ప్రస్తుతం కూలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.