బిగ్ బాస్ 6 లో 3వ వారం కెప్టెన్సీ టాస్క్ హోరా హోరీగా జరుగుతుంది.బిగ్ బాస్ ఇచ్చిన దొంగా పోలీస్ ఆటలో ఎవరికి వారు రెచ్చిపోయి మరీ ఆడుతున్నారు.
అయితే తమ టాలెంట్ చూపించేందుకు ఇదే మంచి ఛాన్స్ అని కొందరు హౌజ్ మెట్స్ గొడవలకి దిగుతున్నారు.మంగళవారం ఎపిసోడ్ లో శ్రీహాన్ ని ఇనయా వాడు అన్నదని గొడవకి దిగారు.
అయితే మధ్యలో రేవంత్ కలుగచేసుకుని ఇనయాని కోస్తా అని అన్నాడు.దానికి ఇనయా కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.
బిగ్ బాస్ సీజన్ 6లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ అనుకున్న రేవంత్ మొదటినుంచి దూకుడు చూపిస్తున్నాడు.అయితే అతనికి కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతాడో అతనికే తెలియదు.
అది అతని ఆటకి మైనస్ అవుతుంది.బిగ్ బాస్ లైవ్ చూసే వారికి ఈ విషయం బాగా అర్ధమవుతుంది.
సీజన్ 6లో రేవంత్ టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడని అనుకుంటుంటే అతని మాటల వల్ల అతని ఆట ట్రాక్ తప్పుదుతుంది.మరి రేవంత్ ఈ విషయాన్ని సరిచేసుకుంటే బాగుంటుంది లేకపోతే టాప్ 5 దాకా ఉండటం కూడా కష్టమే అని చెప్పొచ్చు.