సిరి షన్నుకి పెట్టిన ముద్దుపై స్పందించిన సిరి బాయ్ ఫ్రెండ్..జబర్దస్త్ పంచ్ వేసాడుగా..!

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు గ్రాండ్ గా స్టార్ అయిన విషయం తెలిసిందే.

ఇక అన్ని సీజన్స్ లాగానే ఈ సీజన్ లో కూడా గొడవలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.

బిగ్ బాస్ పెట్టే చిచ్చుకి కంటెస్టెంట్స్ బలి అవుతున్నారు.ఇక బిగ్ బాస్ లో గొడవలతో పాటు రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ కూడా కలిపేస్తూ ఉంటారు.

ఇక ఈసారి తెలుగు బిగ్ బాస్ లో కాంటెస్టెంట్స్ వీటన్నిటితో పాటు మరో అడుగు ముందుకు వేసి ఫ్రెండ్స్ అంటూనే కౌగిలింతలు, ముద్దులు అంటూ మరోక లెవల్లోకి వెళుతున్నారు.బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం అయినప్పటి నుండి షణ్ణు, సిరి ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నరు.

మధ్యలో స్కిట్స్ పరమగా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అయిన కూడా వెంటనే కలిసి పోతు ఉండేవారు.ఇక మంచి ఫ్రెండ్స్ గా ఉంటున్న వీరి మధ్య తాజాగా ఒక చిన్న సంఘటన జరిగింది.

Advertisement

సిరి షన్నుకు ముద్దు పెట్టింది.ఇప్పుడు ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక బిగ్ బాస్ ఇంత రొమాంటిక్ సన్నివేశాన్ని ఎందుకు క్యాప్చర్ చేయకుండ ఉంటాడు.ఈ సన్నివేశాన్ని క్యాప్చర్ చేయడమే కాకుండా ఒక మంచి పాట కూడా జోడించి టీవీల్లో వదిలాడు.దీంతో ఈ సన్నివేశం ఇప్పుడు వైరల్ అయింది.

ఈ విషయం పై నెటిజన్లు సిరి ని ట్రోల్ చేస్తూ ఆమె బాయ్ ఫ్రెండ్ ను కూడా ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.దీంతో ఈ విషయం పై సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ స్పందించాడు.

నిన్న శ్రీహన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ విషయం పై స్పందిస్తూ.ఇప్పుడు నేను ఏడ్చేయాలా ఏంటి? ఇదే పని సినిమాలోనో, షార్ట్ ఫిల్మ్స్ లోనో చేస్తే మీకు ఓకే కదా అని.ట్రోల్ చేస్తున్న వారికి దిమ్మతిరిగే కౌంటర్ వేసాడు.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు