తిరుపతిలో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న బిగ్ బాస్ బ్యూటీ వాసంతి?

బిగ్ బాస్(Bigg Boss) సీజన్ సిక్స్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో వాసంతి కృష్ణన్ (Vasanthi Krishnan) ఒకరు ఈమె ఈ కార్యక్రమానికి రాకముందు సంపూర్ణేష్ బాబు సినిమాలో నటించారు.అనంతరం పలు బుల్లితెర సీరియల్స్ కూడా నటించారు.

 Bigg Boss Vasanthi Engagement Photos Goes Viral Details, Bigg Boss, Vasanthi, Pa-TeluguStop.com

ఇక బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం పలు సీరియల్స్ అలాగే బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా మారిపోయారు.ఇదిలా ఉండగా తాజాగా వాసంతి కృష్ణన్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనే వ్యక్తితో ఎంతో ఘనంగా నిశ్చితార్థం( Engagment ) జరుపుకున్నారని తెలుస్తుంది.

ఈమె స్వస్థలం తిరుపతి( Tirupati ) కావడంతో తిరుపతిలోని తాజ్ హోటల్ లో వాసంతి పవన్ కళ్యాణ్ ల నిశ్చితార్థపు వేడుక ఎంతో ఘనంగా జరిగింది.ఈ నిశ్చితార్థపు వేడుకకు బిగ్ బాస్ సీజన్ 6( Bigg Boss 6 ) కంటెస్టెంట్లు అర్జున్, శ్రీ సత్య, గీతూ రాయల్, ఆర్ జె సూర్య వంటి తదితరులు హాజరయ్యారు.ఇక ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వాసంతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక వాసంతి( Vasanthi ) పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఈయన కూడా హీరోగా రెండు సినిమాలలో నటించారు.త్వరలోనే ఆ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తోంది.ఇక వాసంతి ప్రేమ వివాహం చేసుకుంటున్నారు గత ఏడాది వీరిద్దరికి పరిచయం ఏర్పడే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే పెద్దలను ఒపించి వీరిద్దరూ కూడా తమ ప్రేమ వివాహాన్ని ఘనంగా చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

డిసెంబర్ 7వ తేదీ నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు మరి పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలను త్వరలోనే తెలియచేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube