బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ కి( Bigg Boss 7 Telugu ) సమయం సమీపిస్తుంది .తొలి సీజన్ ని ఎన్టీఆర్ సూపర్ హిట్ చేసాడు.
ఆ తర్వాత నాని ఆ రేంజ్‌లో మెప్పించలేకపోయినా.తనదైన శైలిలో మెప్పించాడు.
సీజన్ 3 నుంచి 6 వరకు వరుసగా నాగార్జున ( Nagarjuna ) హోస్ట్‌గా వ్యవహరించారు.అయితే సీజన్ 6 మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.తాజాగా బిగ్‌బాస్ 7వ సీజన్ పై బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది .సీజన్ 7ను సరికొత్తగా ప్లాన్ చేస్తూ డిజైన్ చేస్తున్నట్టు సమాచారం .ముఖ్యంగా బిగ్‌బాస్‌కు లీకులు అనేది పెద్ద డిజాప్పాయింట్ అనే చెప్పాలి.ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు.
ఈ వారం కెప్టెన్ ఎవరు.హౌస్‌లో ఎలాంటి టాస్క్‌లు ఇవ్వబోతున్నారు.
ఎవరు మొదటి తమ టాస్క్ కంప్లీట్ చేసారనేది ముందుగా సోషల్ మీడియాలో లీకులు కావడం అనేది చూసే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోయేలా చేస్తోంది ఇక బిగ్‌బాస్ సీజన్ 1 హౌస్ సెట్‌ను పూణెలో వేసారు.అక్కడ పనిచేసే వాళ్లలో ఎవరు తెలుగు వారు లేకపోవడం వల్ల లీకులు కాలేదు.
కానీ సీజన్ 2 నుంచి అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్‌బాస్ నడుస్తోంది.ఇక్కడ పనిచేసే వాళ్లంత లోకల్ కావడం వల్ల లీకులు ( Bigg Boss Leaks ) ఆటోమేటిక్‌గా జరిగిపోతున్నాయి.
ఇపుడా ఆ లీకులు కాకుండా బిగ్‌బాస్ టీమ్ జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారని తెలుస్తుంది .ముందే ఇన్‌ఫర్మేషన్ లీకులు కావడం వల్ల అది వ్యూవర్‌షిప్ పై ప్రభావం చూపిస్తోంది.

ఇక నాలుగవ సీజన్ నుంచి రాత్రి 10 గంటలకు టెలికాస్ట్ కావడం పెద్ద మైనస్‌గా మారింది.చాలా మంది ఉదయం లేచి ఆఫీసులకు, కాలేజీలు సహా తమ తమ పనుల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంది…దీంతో చాలా మంది ఆ టైమింగ్‌లో బిగ్‌బాస్ షో( Bigg Boss ) చూడటానికి ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు. బిగ్‌బాస్ సీజన్ 6లో టాస్క్ అనేవి పెద్దగా ప్రేక్షకులను అలరించలేపోయాయి.ఈ సారి సీజన్‌లో కాస్త హాటుగా.ఘాటుగా ప్లాన్ చేసినట్టు సమాచారం.

ముఖ్యంగా ముక్కు మొఖం తెలియని చాలా మంది ఈ షోలో పార్టిసిపేట్ చేయడం వంటివి ప్రేక్షకులు ఈ షోపై ఇంట్రెస్ట్ తగ్గించేలా చేస్తోంది అందుకే సీజన్ 7లో కాస్త కాంట్రవర్షల్ క్యాండిడేట్స్‌ను ఈ షోలో తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.మొదటి మూడు సీజన్స్‌లో చాలా మంది ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు ఉండటంతో అప్పట్లో ఈ షో సూపర్ హిట్టైయింది.రాను రాను ఎవరికీ అంతగా తెలియని యూట్యూబర్స్‌ను పట్టుకొని రావడం వల్ల ఈ షో ఇమేజ్ డ్యామేజ్ అయింది.
ఇప్పుడు తెలిసిన వాళ్ళని తీసుకోవాలని .అందరు తెలిసిన ఫేసెస్ ఉండేలా ప్లాన్ చేస్తన్నట్టు సమాచారం
.