బిగ్ బాస్ సీజన్ 6 రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆరవ వారంలో భాగంగా కెప్టెన్సీ టాస్క్ మొదలైంది.
ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ లు చాలావు అన్నట్లు కంటెస్టెంట్లు కూడా ట్విస్ట్ ల మీద ట్విస్టులు ఇస్తున్నారు.అయితే 6 వ వారం ఎలా అయినా కెప్టెన్‌గా నిలవాలని వాసంతి, రేవంత్, ఆదిరెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్, అర్జున్, రోహిత్ లు గట్టిగానే పోటీపడుతున్నారు.
కాగా కెప్టెన్ అవ్వాలంటే దానికి ఇంటిసభ్యుల మద్దతు తప్పనిసరి అని తెలిపాడు బిగ్‌బాస్.
ఈ నేపథ్యంలోనే తనకెవరూ సపోర్ట్ చేయడం లేదని, గేమ్‌లో కార్నర్ చేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేసింది వాసంతి.
తన స్నేహితులైన రేవంత్, శ్రీసత్యలు ఇద్దరూ తమకు ఓటేయమని నిల్చోగా.శ్రీహాన్ శ్రీసత్యకు మద్దతు పలికాడు.ఏదో చిన్న కారణంతో తనకు సపోర్ట్ చేయలేదంటూ గీతూ, బాలాదిత్య పై ఫైర్ అయింది శ్రీసత్య.చాలా చిన్న విషయం తీసుకువచ్చి నన్ను కెప్టెన్సీ కంటెండర్‌గా తీసేయడం సిల్లీగా ఉంది అంటూ కోప్పడింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే మెరీనా కంటెస్టెంట్లకు అలాగే తన భర్త రోహిత్ కు ఊహించని షాక్ ఇచ్చింది.
రోహిత్, సూర్య, ఇద్దరిలో సూర్యకు సపోర్ట్ చేసింది మెరీనా.ఆఖరికి తన భార్య కూడా తనకు సపోర్ట్ చేయకపోవడంతో అవాక్కయ్యాడు రోహిత్.మెరీనా చేసిన పనికి రోహిత్ పాటు హౌస్ లోని కంటెస్టెంట్లు కూడా అవాక్కయ్యారు.
ఏది ఏమైనాప్పటికీ బిగ్బాస్ హౌస్లో ఆరవ వారం కెప్టెన్సీ టాస్క్ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో మరింత రసవత్తరంగా మారుతోంది.మరొకవైపు చూసావా మీడియాలో ఆరో వారం హౌస్ నుంచి రోహిత్ తప్పకుండా ఎలిమీనేట్ అవుతాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.