తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే 10 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని 11వ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇప్పటికే హౌస్ లో నుంచి 11 మంది కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు.
ఇది ఇలా ఉంటే తాజాగా అప్పుడే బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం నామినేషన్స్ రచ్చ మొదలయ్యింది.బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ వచ్చాయి అంటే చాలు అప్పటివరకు కలిసి ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఏవేవో కారణాలు వెతికి పట్టుకుని మరి ఒకరినొకరు నామినేట్ చేస్తూ మాటలతో యుద్ధం చేస్తూ ఉంటారు.
నామినేషన్స్ మొదలయ్యాయి అంటే చాలు హౌస్ లో వేడి ఒక్కసారిగా హీట్ ఎక్కిపోతుంది.మాటలు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి.ఇది ఇలా ఉంటే బిగ్బాస్ ఏజన్ సిక్స్ పదకొండవ వారం నామినేషన్స్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయింది.ఇక ఈ ప్రోమోలో రాజ్ వాసంతి నా గురించి మాట్లాడుతుంటే మధ్యలోకి వస్తున్నావు నీకెందుకు అని ఇనయా ను నిలదీయడంతో అప్పుడు ఆమె తనకు ఏది అనిపిస్తే అది చెబుతాను అనడంతో.
అంటే నువ్వు ఏ సోది చెప్పినా మేమందరం కూర్చుని వినాలా అని ఫైర్ అయ్యాడు రాజ్.ఆ తర్వాత ఆవేశంలో బూతులు మాట్లాడుతున్నావు అంటూ ఇనయా ను నామినేట్ చేసింది శ్రీ సత్య.

ఆ తర్వాత రోహిత్ కెప్టెన్సీ గేమ్ ఓడిపోవడానికి కారణమైన రేవంత్ ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు.ఆ తర్వాత మెరినా కూడా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు అంటూ రేవంత్ ని నామినేట్ చేసింది.ఆ తర్వాత రేవంత్ వంతు రావడంతో హౌస్ లో ప్రతి చిన్న పాయింట్ పట్టుకుని నామినేట్ చేస్తున్నారు.అలా చిన్నపాటి విషయాలకు కూడా నామినేట్ చేసిన సందర్భాలలో 70% బాధితుడిని నేనే అవుతున్నాను అని తెలిపాడు రేవంత్.
దానికి ప్రోమో ని బట్టి చూస్తే 11 వారం నామినేషన్స్ ప్రక్రియ వేడివేడిగా సాగింది అని చెప్పవచ్చు.







