తండ్రి లేకపోయినా ఉన్నాడని అబద్ధం చెప్పాను.. రేవంత్ తల్లి కామెంట్స్ వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ రేవంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్నో పాటలను పాడి సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న రేవంత్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.

ఫస్ట్ నుంచి కూడా టాప్ వన్ కంటెస్టెంట్ గా రాణిస్తున్నాడు రేవంత్.అంతేకాకుండా ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 రేవంత్ తప్పకుండా గెలుస్తాడు అంటూ ఇప్పటికే వార్తలు కూడా వస్తున్న విషయం తెలిసిందే.

అయితే బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ టాస్కుల విషయంలో కంటెస్టెంట్లతో కొట్లాటలు పడి గొడవలు పడి అనంతరం వారికి వెళ్లి స్వారీ చెప్పి వారితో కలిసిపోవడం ఇలా అన్నీ కూడా రేవంత్ కి ప్లస్ గా మారాయి.

దీంతో అతను మొదట్లో నుంచి కూడా టాప్ వన్ కంటెస్టెంట్ గా దూసుకుపోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఇటీవలే ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ కి రేవంత్ తల్లి సుబ్బలక్ష్మి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో సీతా సుబ్బలక్ష్మి పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నా భర్త పేరు శంకర.

నాకు మొదట కొడుకు పుట్టాడు.తర్వాత రేవంత్‌ కడుపులో ఉండగానే నా భర్త చనిపోయాడు.

కానీ మా ఆయన లేకపోయినా బంగారం లాంటి పిల్లల్నిచ్చారని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను.భర్త లేకుండా ఇద్దరు పిల్లల్ని పెంచానంటే అది నా ఫ్యామిలీ వల్లే.

Telugu Bigg Boss, Nagarjuna, Revanth, Revanth Mother, Tollywood-Movie

మా నాన్న, అమ్మ, అన్నయ్యలు, వదినలు నన్ను, నా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు.వాళ్లు అండగా లేకపోతే నేను రోడ్డున పడేదాన్ని అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది సీతా సుబ్బలక్ష్మి.అయితే రేవంత్ పుట్టిన తర్వాత నాన్న లేడని చెబితే మనసులో బాధ పెట్టుకుంటాడని నిజం దాచాను.మీ నాన్న దుబాయ్ లో ఉంటారు నిదానంగా వస్తారులే అని చెప్పే వాళ్ళము అని చెప్పుకొచ్చింది సీత సుబ్బలక్ష్మి.

కానీ ఇప్పటికీ వాడిని చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది.

Telugu Bigg Boss, Nagarjuna, Revanth, Revanth Mother, Tollywood-Movie

ఎందుకంటే వాడు తన తండ్రి ప్రేమకు నోచుకోలేదు.భగవంతుడు ఎందుకు ఆ లోటు మిగిల్చాడని ఎప్పుడు బాధపడేదాన్ని.రేవంత్ కి అన్ని నా లక్షణాలు వచ్చాయి కానీ అంత కోపం నాకు లేదు.

వాడి కోపం కాసేపే ఉంటుంది ఆ తర్వాత మామూలు అయిపోయి సారీ చెబుతాడు అంటూ రేవంత్ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది సీత సుబ్బలక్ష్మి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube