బిగ్ బాస్ విన్నర్ అతనే.. శ్వేత వర్మ షాకింగ్ కామెంట్స్?

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ ఫైవ్ 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమై ఆరు వారాలను విజయవంతంగా పూర్తిచేసుకుని ఆరుగురు కంటెస్టెంట్ హౌస్ నుండి ఎలిమినేట్ చేశారు.

అయితే ఈ బిగ్ బాస్ కార్యక్రమం ఎటు నుంచి ఎటు వైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితులలో ప్రేక్షకులు ఉన్నారు.

ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లను హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తూ ఉండడంతో ఈ కార్యక్రమంపై ప్రేక్షకులు ఎలాంటి ఉత్సాహం చూపించలేదని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆరో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్ శ్వేతవర్మ ఎలిమినేట్ అయ్యారు.

అయితే శ్వేత వర్మ ఎలిమినేట్ కావడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఆరు వారాల పాటు ప్రేక్షకులకు సందడి చేసిన శ్వేతా వర్మ బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే పలు ఇంటర్వ్యూలలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునేది ఎవరో తెలియజేశారు.

Advertisement

ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో సన్నీ ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, అతనే బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుంటారనీ శ్వేతా వర్మ తెలియజేశారు.అదేవిధంగా టాప్ 3 కంటెస్టెంట్ గా సన్నీతో పాటు మానస్‌, యానీ మాస్టర్‌ టాప్ త్రీ పొజిషన్లో ఉంటారని ఈ సందర్భంగా శ్వేత వర్మ తెలియజేశారు.మరి శ్వేతా వర్మ జోస్యం నిజం అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు